ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్

ABN, First Publish Date - 2020-04-06T13:56:13+05:30

ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్ సోకిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసుపత్రులకు తరలింపు

ముంబై : ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్ సోకిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన 10మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో వారిలో ఆరుగురిని మరోల్ లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి, మరో నలుగురిని విల్లేపార్లేలోని నానావతీ ఆసుపత్రికి తరలించారు.


ముంబై నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏరోజుకారోజు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్ ల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఆదివారం ఒక్కరోజే ముంబై నగరంలో కొత్తగా 103 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ముంబై నగరంలో 238 మంది కరోనాతో ఆసుపత్రుల్లో చేరారు.


కరోనా సోకిన అంధేరి కుటుంబసభ్యులు సూరత్ నగరంలో జరిగిన వివాహంలో పాల్గొని వచ్చారని, వారికి అక్కడే వైరస్ బారిన పడి ఉంటారని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు బెడ్లు లేవని ఆసుపత్రుల యాజమాన్యాలు చెపుతున్నాయని ఓ రోగి ఆవేదనగా చెప్పారు. కాగా కరోనా అనుమానితులను తరలించేందుకు మరిన్ని ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేస్తున్నామని ముంబై అదనపు మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాణీ చెప్పారు. 

Updated Date - 2020-04-06T13:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising