ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లిగ్ జమాత్ సభ్యుల నుంచి 10 మంది పోలీసులకు కరోనా వైరస్

ABN, First Publish Date - 2020-04-08T11:54:11+05:30

విధి నిర్వహణలో ఉన్న పదిమంది పోలీసులకు కరోనా వైరస్ సోకిన ఘటన ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): విధి నిర్వహణలో ఉన్న పదిమంది పోలీసులకు కరోనా వైరస్ సోకిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరంలోని తబ్లిగ్ జమాత్ సభ్యుల నుంచి పోలీసులకు ఈ వైరస్ సోకిందని అధికారులు చెపుతున్నారు. భోపాల్ నగరంలోని మసీదుల్లో దాక్కున్న తబ్లిగ్ జమాత్ సభ్యులను పోలీసులు పట్టుకొని వారిని క్వారంటైన్ కు తరలించారు. ఈ క్రమంలో సిటీ పోలీసు సూపరింటెండెంట్ తోపాటు ఓ సబ్ ఇన్ స్పెక్టరు, 8మంది పోలీసు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.ఢిల్లీ వెళ్లి వచ్చిన తబ్లిగ్ జమాత్ సభ్యుల కోసం పోలీసులు గాలించారని, వారి ద్వారానే కరోనా సోకి ఉంటుందని భోపాల్ పోలీసు ఐజీ ఉపేంద్ర జైన్ చెప్పారు.


భోపాల్ నగరంలోని ఐష్ బాగ్, జహంగీరాబాద్ పోలీసుస్టేషన్లకు చెందిన వారికే కరోనా సోకింది. పోలీసులు 32 మంది జమాత్ సభ్యులు, ఏడుగురు విదేశీయులను పట్టుకున్నారు. పోలీసులకు కరోనా సోకడంతో అన్ని పోలీసుస్టేషన్లను శానిటైజ్ చేశామని, వెయ్యిమంది పోలీసులను హోటళ్లకు తరలించామని పోలీసు ఐజీ చెప్పారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన జమాత్ సభ్యులు ఆసుపత్రులకు రాకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు.

Updated Date - 2020-04-08T11:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising