కోవిడ్ సోకిన ఖైదీల కోసం జమ్మూ-కశ్మీరులో తాత్కాలిక జైళ్ళు
ABN, First Publish Date - 2020-10-03T23:33:14+05:30
జమ్మూ-కశ్మీరు జైళ్ళలో కోవిడ్-19 విజృంభిస్తోంది. జమ్మూ ప్రాంతంలోని వివిధ జైళ్ళలోని 185 మంది ఖైదీలకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది.
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు జైళ్ళలో కోవిడ్-19 విజృంభిస్తోంది. జమ్మూ ప్రాంతంలోని వివిధ జైళ్ళలోని 185 మంది ఖైదీలకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. కరోనా వ్యాధి లక్షణాలు పైకి కనిపించని పాజిటివ్ ఖైదీలను ఐసొలేషన్‌లో ఉంచేందుకు తాత్కాలిక జైళ్ళను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ శనివారం మాట్లాడుతూ, జమ్మూ ప్రాంతంలోని వివిధ జైళ్ళలోని 185 మంది ఖైదీలకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందని తెలిపారు. కరోనా వ్యాధి లక్షణాలు పైకి కనిపించని పాజిటివ్ ఖైదీలను ఐసొలేషన్‌లో ఉంచేందుకు తాత్కాలిక జైళ్ళను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖైదీలు, సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దక్షిణ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లా జైలు, శ్రీనగర్ కేంద్ర కారాగారంలలో సుమారు 200 మంది ఖైదీలు ఈ వ్యాధి నుంచి గత నెలలో కోలుకున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-10-03T23:33:14+05:30 IST