ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై పోరాడటానికి టీబీ, పోలియో వ్యాక్సిన్లు

ABN, First Publish Date - 2020-06-12T13:38:36+05:30

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు ప్రజలకు తీపి కబురు వెల్లడించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి

వాషింగ్టన్ డీసీ (అమెరికా): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు ప్రజలకు తీపి కబురు వెల్లడించారు. టీబీ, పోలియో వ్యాక్సిన్లతో కరోనా వైరస్ బారినుంచి తాత్కాలిక రక్షణ పొందవచ్చని తమ పరిశోధనల్లో తేలిందని అమెరికా పరిశోధకులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు కొవిడ్ -19 వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ పరీక్షలు జరుపుతున్న సమయంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న టీబీ, పోలియో వ్యాక్సిన్లతో కరోనా నుంచి తాత్కాలిక రక్షణ పొందవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు. టీబీ, పోలియో వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంచి కరోనా రాకుండా తాత్కాలికంగా రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు సైంటిఫిక్ జర్నల్ లో రాశారని వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. టీబీ వ్యాక్సిన్ కరోనాను కట్టడి చేస్తుందా అనే అంశంపై  అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో క్లినికల్ పరీక్షలు సాగుతున్నాయి.


ప్రస్థుతానికి ప్రపంచంలో కొవిడ్ నుంచి తాత్కాలికంగా రక్షణ కల్పించేది టీబీ వ్యాక్సిన్ ఒక్కటేనని టెక్సాస్ లోని ఎ అండ్ ఎం హెల్త్ సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ జెఫ్రీ డి సిరిల్లో చెప్పారు. టీబీ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల సమస్యతోపాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. బీసీజీ వ్యాక్సిన్ కూడా ప్రజల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ చెప్పారు. బీసీజీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే భారత్, పాకిస్థాన్ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉందని మరో శాస్త్రవేత్త అజ్రారజా చెప్పారు.  

Updated Date - 2020-06-12T13:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising