ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వల్వంగా మెరుగుపడిన మాజీ సీఎం ఆరోగ్యం

ABN, First Publish Date - 2020-11-22T21:47:34+05:30

కోవిడ్ పాజిటివ్ సమస్యల నుంచి ఇటీవల కోలుకుంటున్న తరుణంలో మళ్లీ ఆయన ఆరోగ్యం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి ఒకింత మెరుగుపడినట్టు గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శర్మ ఆదివారంనాడు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంట్యుబేట్ (శ్వాసనాళంలో గొట్టం అమర్చడం) చికిత్స అందిస్తున్నామని, ఆయన ఏజీబీ (ఆర్టిరియల్ బ్లడ్ గ్యాస్) స్వలంగా మెరుగుపడందని చెప్పారు. కోవిడ్ పాజిటివ్ సమస్యల నుంచి ఇటీవల కోలుకుంటున్న తరుణంలో మళ్లీ ఆయన ఆరోగ్యం శనివారం విషమించింది. శరీరంలోని కీలకావయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు..


తరుణ్ గొగోయ్ గత ఆగస్టులో కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. రెండు నెలలుగా తనకు చక్కటి వైద్య చికిత్స అందిస్తున్న నిపుణులు, వైద్యులు, నర్సులు, సిబ్బందికి గత అక్టోబర్‌లో గొగోయ్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఇంటిలో చికిత్స కొనసాగించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-11-22T21:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising