ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాట స్పీడ్ పెంచిన రజినీకాంత్..!

ABN, First Publish Date - 2020-09-22T16:30:06+05:30

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజనీ మక్కల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజనీ మక్కల్‌ మండ్రాలలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడంలో తలమునకలవుతున్నారు. డిసెంబర్‌లోగా పార్టీ పేరు ప్రకటించడం, మదురై లేదా చెన్నైలో పార్టీ మహానాడును నిర్వహించడం ఆ తర్వాత జనవరిలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో మంతనాలు జరుపటం అంటూ రజనీ ఇప్పటికే తగు ప్రణాళికలను రూపొందించుకున్నారని మక్కల్‌ మండ్రం నేతలు తెలిపారు. ఇటీవల తంజావూరులో జరిగిన రజనీ మక్కల్‌ మండ్రం నాయకుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ నేతలు రజనీ పరిశీలనకు కూడా పంపారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌ లోగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని, ఆ తర్వాత ప్రధాన నగరాల్లో బహిరంగ సభలు జరిపి, రజనీ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన జరపాలని పార్టీ నేతలు పంపిన నివేదికలో సూచించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రజనీ మక్కల్‌ మండ్రాల్లో ఖాళీగా ఉన్న కీలకమైన పదవులన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 


ఈ నేపథ్యంలో రజనీ గత మూడు రోజులుగా రజనీ మక్కల్‌ మండ్రం జిల్లా శాఖల నుండి ఖాళీగా వున్న పదవుల సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలన జరుపుతున్నారు. రజనీ మక్కల్‌ మండ్రంలో నేతలే పార్టీ నేతలుగా మారే అవకాశం ఉండటంతో కొత్త నియామకాలపై రజనీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విద్యావంతులకు, యువకులకు, దశాబ్దాల తరబడి వీరాభిమానులుగా ఉన్నవారిని పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని రజనీ భావిస్తున్నారు. పక్షం రోజుల్లో రజనీ మండ్రాల్లో ఖాళీగా ఉన్న పదవులన్నింటినీ ఆయన భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఫోన్లలో మండ్రం జిల్లా శాఖల నాయకులతో సమగ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, డిసెంబర్‌లోగా పార్టీ పేరును ప్రకటించి రజనీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రచారం సాగించనున్నారని మండ్రం నేతలు చెబుతున్నారు.

Updated Date - 2020-09-22T16:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising