ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 జిల్లాలకు వర్షసూచన

ABN, First Publish Date - 2020-08-10T17:00:50+05:30

16 జిల్లాలకు వర్షసూచన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రానున్న 48 గంటల్లో 16 జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతవరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు ఆ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... ఉపరితల ఆవర్తనం కారణంగా సముద్రతీర ప్రాంతాలు, కోవై, నీలగిరి జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందన్నారు. వేలూరు, తిరువళ్లూర్‌, తిరుపత్తూర్‌, తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, తంజావూరు, తిరువారూర్‌, నాగపట్టణం, కరూర్‌, తిరుచ్చి, పుదుకోట, కన్నియకుమారి జిల్లాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందన్నారు. అలాగే, అరియలూరు, పెరంబ లూర్‌, మదురై, శివగంగ, రామనాథపురం, విరుదునగర్‌ జిల్లాల్లోను పుదుచ్చేరి, కారైక్కాల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2020-08-10T17:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising