ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవై విమానాశ్రయ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN, First Publish Date - 2020-08-20T14:03:33+05:30

కోవై విమానాశ్రయ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోయంబత్తూర్‌ శివారులో రూ.500 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు మద్రాసు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి అవసరమైన స్థలసేకరణను వ్యతి రేకిస్తూ కాళిపట్టి, సూలూరు ప్రాంతా నికి చెందిన 12 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. అందులో... అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ కోసం తమ ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల  సేకరించడంపై స్టే విధించాలని 2017లో న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం విస్తరణ పనులను స్థానికులకు ఎలాంటి అభ్యంతరం లేకుండా చేపట్టాలని, భూ దాతలకు తగిన నష్టపరిహారం ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అధికారులు ఈ ఉత్తర్వులను పాటించకుండా 600 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ మళ్లీ కాలపట్టి, సూలూరు వాసులు కోర్టును ఆశ్రయించడంతో స్థలసేకరణకు న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధిం చిన రెండు వర్గాల  పిటిషనర్ల వద్ద విచారణ పూర్తికావడంతో మద్రాసు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సాహి, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన బెంచ్‌ తీర్పు వెలువరించింది. కోవై అంతర్జాతీయ విమా నాశ్రయ విస్తరణ పనులకు విధించిన స్టేను రద్దు చేస్తూ, భూ దాతలు మళ్లీ కోర్టును ఆశ్రయించ కుండా వారికి చెందాల్సిన సష్టపరి హారం వెంటనే అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 

Updated Date - 2020-08-20T14:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising