ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్

ABN, First Publish Date - 2020-08-02T23:34:47+05:30

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కావేరీ హాస్పిటల్ అధికారికంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కావేరీ హాస్పిటల్ అధికారికంగా ప్రకటించింది. ఆయనకు కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై కావేరీ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. ఆయనకు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు. కావేరీ హాస్పిటల్ వైద్య బృందం ఆయనకు ఇంటి వద్దే చికిత్సనందిస్తుందని తెలిపారు.


తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. దాదాపు రెండు వారాల క్రితం నుంచే తమిళనాడు గవర్నర్ ఐసోలేషన్‌లో ఉన్నారు. గవర్నర్ ఇంటి వద్ద ప్రతీ రోజు డిస్‌ఇన్‌ఫెక్షన్ డ్రైవ్ కూడా నడుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడి, కోలుకున్నారు. తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇతర జిల్లాలకు, పల్లెలకు ఈ మహమ్మారి విస్తరించడం కాస్త ఆందోళన కలిగించే విషయం.



Updated Date - 2020-08-02T23:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising