ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల ఇంటర్నెట్‌ వాడకంపై ఓ కన్నేయండి!!

ABN, First Publish Date - 2020-04-09T08:31:40+05:30

లాక్‌డౌన్‌ వేళ ఎంతోమంది పిల్లలు ఇళ్లలో కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో పాఠాలు నేర్చుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు. కార్టూన్లు, కథల వీడియోలు చూస్తూ విజ్ఞాన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో తల్లిదండ్రులకు ‘సెర్ట్‌’ సూచనలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 : లాక్‌డౌన్‌ వేళ ఎంతోమంది పిల్లలు ఇళ్లలో కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో పాఠాలు నేర్చుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు. కార్టూన్లు, కథల వీడియోలు చూస్తూ విజ్ఞాన వినోదాల నడుమ ఉర్రూతలూగుతున్నారు. అయితే ఈక్రమంలో పిల్లలను పర్యవేక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా(సెర్ట్‌) సూచిస్తోంది.


ఇంటర్నెట్‌ను వినియోగించే క్రమంలో ‘స్నేహం చేద్దాం’ అంటూ అపరిచితుల నుంచి వచ్చే విజ్ఞప్తులకు పిల్లలు స్పందించి.. ఊరు, పేరు, పాఠశాల వివరాలు, ఇంటి చిరునామా, ఫోన్‌ నంబర్లు సమర్పిస్తే వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లుతుందని హెచ్చరించింది. కీలకమైన యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఆన్‌లైన్‌లో అపరిచితులతో షేర్‌ చేయకుండా చూడాలి. కంప్యూటర్‌ వాడే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు కొంత సమయాన్ని వెచ్చించాలని తల్లిదండ్రులను సెర్ట్‌ కోరింది.

Updated Date - 2020-04-09T08:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising