ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లిగ్ జమాత్ సభ్యులు మానవ బాంబుల్లా తిరిగారు..హిమాచల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-04-05T12:36:08+05:30

తబ్లిగ్ జమాత్ సభ్యులపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ సంచలన వ్యాఖ్యలు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): తబ్లిగ్ జమాత్ సభ్యులపై హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు తబ్లిగ్ జమాత్ సభ్యులు మానవబాంబుల్లా దేశంలో తిరిగారని రాజీవ్ బిందాల్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశంలో కరోనా వైరస్ కట్టడికి పోరాడుతున్నాయని బిందాల్ చెప్పారు. దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనా కట్టడికి సహకారం అందిస్తున్నారని, కాని కొందరు మానవ వ్యతిరేక శక్తులు కరోనా తీవ్రతను గుర్తించడం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో మొత్తం 3వేల కరోనా కేసులు బయటపడగా, వాటిలో నిజాముద్దీన్ మర్కజ్ తబ్లిగ్ జమాత్ సభ్యులే 1,023 మంది ఉన్నాయని, జమాత్ సమావేశమే కరోనాకు ప్రధాన హాట్ స్పాట్‌గా మారిందని బీజేపీ నాయకుడు రాజీవ్ బిందాల్ చెప్పారు.


Updated Date - 2020-04-05T12:36:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising