ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-04-05T14:08:50+05:30

మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అధినేత రాజ్ ఠాక్రే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సులను వేధించిన తబ్లిగ్ జమాత్ సభ్యులను కాల్చి చంపాలి...

ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అధినేత రాజ్ ఠాక్రే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరి నర్సులను వేధించిన తబ్లిగ్ జమాత్ సభ్యులను కాల్చి చంపాలని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. నర్సులను వేధించిన వారికి వైద్యచికిత్సలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఘజియాబాద్ లోని ఆసుపత్రిలో జమాత్ సభ్యులు ప్యాంటు తీసి అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అలాంటి వారికి చికిత్స చేయకుండా కాల్చిచంపాలని రాజ్ ఠాక్రే సూచించారు.


వసాయిలో నిజాముద్దీన్ లాంటి తబ్లిగ్ జమాత్ సమావేశం నిర్వహణకు అనుమతి నిరాకరించిన మహారాష్ట్ర పోలీసులను ఎంఎన్ఎస్ చీఫ్ అభినందించారు. కరోనా ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో మతం గురించి మాట్లాడే సమయం కాదని, ముస్లిముల్లో కొందరు చేస్తున్న పనులు బాగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, విద్యుత్, మంచినీటి సరఫరా శాఖ అధికారులను రాజ్ ఠాక్రే ప్రశంసించారు.

Updated Date - 2020-04-05T14:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising