ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఆడియో సందేశం

ABN, First Publish Date - 2020-04-02T16:48:18+05:30

తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ తన అనుచరులకు గురువారం ఆడియో సందేశం విడుదల చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రభుత్వ ఆదేశాలు పాటించండి..

న్యూఢిల్లీ : తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ తన అనుచరులకు గురువారం ఆడియో సందేశం విడుదల చేశారు. వైద్యుల సలహా మేర తాను క్వారంటైన్ లో ఉన్నానని, కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు వీలుగా తబ్లీగ్ జమాత్ కార్యకర్తలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని మౌలానా సాద్  విజ్ణప్తి చేశారు. తబ్లీక్ జమాత్ కార్యకర్తలందరూ ఇంటికే పరిమితమై ప్రభుత్వ ఉత్తర్వులను పాటించండి అంటూ సాద్ సూచించారు.  ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ వద్ద తబ్లిక్ జమాత్ సమావేశాలు నిర్వహించి కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు మౌలానా సాద్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తుండగా, మరోవైపు ఆయన గురువారం జమాత్ కార్యకర్తల కోసం ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.


దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్ అయిన ఢిల్లీ మర్కజ్ సమావేశాల్లో 8,500 మందికి పైగా కార్యకర్తలు హాజరయ్యారు. కరోనా ప్రబలకుండా నిజముద్దీన్ ప్రాంతంలోని బంగ్లావాలీ మసీదు, తబ్లిక్ జమాత్ కేంద్ర కార్యాలయమైన మర్కజ్ ను పోలీసులు ఖాళీ చేయించారు. జమాత్ కార్యకర్తలను కరోనా లక్షణాలున్నాయని క్వారంటైన్ చేశారు. నిజాముద్దీన్ జమాత్ సమావేశం వల్ల  కరోనా వైరస్ వ్యాప్తి చెంది కేసుల సంఖ్య పెరిగింది. దీంతో పోలీసులు, వైద్యాధికారులు జమాత్ కార్యకర్తల కోసం గాలిస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ సమయంలో మతపరమైన సమావేశాలు, సమ్మేళనాలకు ప్రజలు దూరంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. 

Updated Date - 2020-04-02T16:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising