ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్ఐఏ ముందు హాజరైన ఐఏఎస్ అధికారి శివశంకర్

ABN, First Publish Date - 2020-09-24T21:27:27+05:30

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొచ్చి: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ముందు విచారణకు హాజరయ్యారు.  ఈ కేసులో కీలక నిందితురాలు స్వప్న సురేశ్‌ను కూడా అధికారులు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చినట్టు సమాచారం. శివశంకర్ ఎన్ఐఏ ముందుకు రావడం ఇది మూడోసారి.  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కీలక నిందితులకు, శివశంకర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో.. కేరళ ప్రభుత్వం ఆయనను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించింది. అనంతరం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా ఇదే కేసులో విచారణ జరుపుతున్న కస్టమ్స్ అధికారులు జూలై 15న శివశంకర్‌ను సుదీర్ఘంగా విచారించారు. జూలై 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఓ ‘‘దౌత్య సంబంధిత’’ బ్యాగులో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-09-24T21:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising