ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
ABN, First Publish Date - 2020-08-22T14:41:24+05:30
సిస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ ని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ధౌలా కువాన్, కరోల్ బాగ్ మధ్య
న్యూఢిల్లీ : ఐసిస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ ని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ధౌలా కువాన్, కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల తర్వాత ఆ ఉగ్రవాదిని అరెస్ట్ చేశామని ప్రత్యేక బృందం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ఆ ఉగ్రవాదిని అరెస్ట్ చేసే సమయంలో ఉగ్రవాది వద్ద పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితమే బెంగళూరులో ఐసిస్‌తో సంబంధాలున్నా ఓ వైద్యుడ్ని జాతీయ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ జరిగి రెండు రోజులైనా కాకముందే... ఢిల్లీలో మరో ఐసిస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2020-08-22T14:41:24+05:30 IST