ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసుపత్రి నుంచి కరోనా వైరస్ అనుమానిత బాధితుడి అదృశ్యం

ABN, First Publish Date - 2020-03-16T12:39:16+05:30

కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండగా, మరోవైపు కరోనా లక్షణాలతో ఉన్న రోగులు ఆసుపత్రుల నుంచి పారిపోతున్న ఘటనలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్బంగా (బీహార్): కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండగా, మరోవైపు కరోనా లక్షణాలతో ఉన్న రోగులు ఆసుపత్రుల నుంచి పారిపోతున్న ఘటనలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ లక్షణాలున్న ఓ రోగి ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుంచి పారిపోయిన ఘటన బీహార్ రాష్ట్రంలోని దర్బంగా వైద్యకళాశాల ఆసుపత్రిలో వెలుగుచూసింది. దర్బంగా నగరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలుండటంతో అతన్ని దర్బంగా వైద్యకళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ గదికి పంపించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐసోలేషన్ గదిలో ఉన్న కరోనా వైరస్ లక్షణాలున్న రోగి పారిపోయాడు. దీంతో తాము జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని దర్బంగా వైద్యకళాశాల ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రాజీవ్ రంజన్ చెప్పారు. పారిపోయిన రోగి కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-03-16T12:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising