ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ వేదికపై భారతీయ గళం సుష్మా స్వరాజ్ : మోదీ

ABN, First Publish Date - 2020-08-07T00:20:02+05:30

మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ  : మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. సుష్మా స్వరాజ్ గొప్ప వక్త అని, ఆమె ప్రపంచ వేదికపై భారతీయ గళం అని పేర్కొన్నారు. గురువారం మోదీ ఇచ్చిన ట్వీట్‌లో ఆమె అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 


‘‘సుష్మా గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నాను. ఆమె అకాల, దురదృష్టకర మరణం అనేక మందికి శోకం మిగిల్చింది. ఆమె భారత దేశానికి నిస్వార్థంగా సేవ చేశారు. ప్రపంచ వేదికపై ఆమె భారత దేశపు స్పష్టమైన భావ ప్రకటన చేసే గళం’’ అని మోదీ పేర్కొన్నారు. 


సుష్మా స్వరాజ్ గత ఏడాది ఆగస్టు 6న గుండెపోటుతో మరణించారు. గురువారం ఆమెను గుర్తు చేసుకుంటూ అనేక మంది రాజకీయ నేతలు నివాళులర్పించారు. ఆమె గొప్ప వక్త అని, అదే సమయంలో కారుణ్యంతో వ్యవహరించేవారని పేర్కొన్నారు. భారత దేశ దౌత్య రంగంలో ఆమె విశేష సేవలందించారని కొనియాడారు. 


విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఓ ట్వీట్‌లో తాను, ఆమె కలిసి ఉన్న అనేక ఫొటోలను పోస్ట్ చేశారు. నేడు ఆమెను ఎంతో ఆత్మీయంగా గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె ఎల్లప్పుడూ గొప్ప ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. 


సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పని చేసిన కాలంలో జైశంకర్ 2015 నుంచి 2018 వరకు  భారత దేశ విదేశాంగ కార్యదర్శిగా పని చేశారు.


Updated Date - 2020-08-07T00:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising