ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా సుప్రీం కమాండర్ నితీశే : సుశీల్ మోదీ

ABN, First Publish Date - 2020-06-07T16:53:09+05:30

ఎన్డీయే పక్షాన ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారేనని ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ పునరుద్ఘాటించారు. తమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ఎన్డీయే పక్షాన ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారేనని ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ పునరుద్ఘాటించారు. తమ సంకీర్ణానికి సుప్రీం కమాండర్ ఆయనే అని తేల్చి చెప్పారు. బీజేపీ నితీశ్‌కు మద్దతిచ్చినా, ఇవ్వక పోయినా తాము మాత్రం బీజేపీతోనే అని భాగస్వామ్య పక్షమైన ఎల్జేపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వేళ సుశీల్ మోదీ పై విధంగా ప్రకటించారు.


‘‘ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ... ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రకటించారు. యుద్ధం మధ్యలో ఉన్న సమయంలో సారథిని మార్చం. గత 20 ఏళ్ల నుంచి ఎన్డీయే కమాండర్‌గా నితీశే కొనసాగుతున్నారు’’ అని మోదీ ప్రకటించారు. 

ఎల్జేపీ యువ నేత చిరాగ్ పాశ్వాన్ ఏమన్నారంటే...

‘‘ఎన్నికల్లో ఎవరి సారథ్యంలో ప్రచారానికి వెళ్లాలి... ఎవరు నాయకుడు? అన్న విషయాన్ని బీజేపీయే తేల్చాలి. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా... తాము ఆ పార్టీతోనే ఉంటాం. నితీశ్ సారథ్యంలోనే వెళ్లాలనుకుంటే ... మేము బీజేపీతోనే ఉంటాం. నాయకత్వాన్ని మార్పు చేసినా... తాము బీజేపీకే మద్దతిస్తాం’’ అంటూ అన్యాపదేశంగా నితీశ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-07T16:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising