ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్కారు వైఫల్యంపై విచారణకు సుప్రీం నిరాకరణ

ABN, First Publish Date - 2020-08-15T08:27:23+05:30

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వ విఫలమయ్యిందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధిం చి విచారణ కమిషన్‌ నియమించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా వైర్‌సను నియంత్రించడంలో కేం ద్రం అసమర్థంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వ విఫలమయ్యిందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ కమిషన్‌ నియమించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా వైర్‌సను నియంత్రించడంలో కేం ద్రం అసమర్థంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఆరుగురు పిటిషనర్లు కలిసి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆరోపణలపై ‘సంచార’ విచారణకు ఆదేశాలివ్వబోమని న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పేర్కొంది.


మహమ్మారులు వం టి ఎమర్జెన్సీ పరిస్థితులలో ప్రభుత్వ కార్యనిర్వాహక నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక అభిప్రాయం స్థిరపడిందని ధర్మాసనం తెలిపింది. రెండు వారాల తర్వాత దీన్ని విచారణకు వేయాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించింది. అదనపు డాక్యుమెంట్లు సమర్పించేందుకు పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది.  కేంద్రం కరోనా వైర్‌సను కట్టడి చేయలేకపోయిందని, ప్రభుత్వం చేసిన ‘తప్పులపై’ సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జిచేత విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.  

Updated Date - 2020-08-15T08:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising