ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడి విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టిన పలు రాష్ట్రాలు

ABN, First Publish Date - 2020-11-25T17:41:08+05:30

కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తోందనే ప్రచారంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తోందనే ప్రచారంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. సుప్రీం కోర్టు సీరియర్ అయిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలకు సై అంటున్నాయి. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న సమయంలో పలు రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు ఉన్నవారిని తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా నాలుగు జిల్లాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ వెల్లడించింది. న్యూఢిల్లీలో మాస్కులు ధరించనివారికి జరిమానాలు విధిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ నిబంధనలు కఠినతరం చేశారు.


వివాహ వేడుకల్లో వందమంది దాటితే రూ.25వేలు జరిమానా వేస్తున్నారు. తమ రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులు ఇకపై ఖచ్చింగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ నెగిటీవ్ రిపోర్టు ఉంటేనే ప్రయాణీకులను రాష్ట్రంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, గోవా నుంచి వచ్చేవారికే ఇది వర్తిస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో కోవిడ్ లక్షణాలు ఉంటే తిరిగి వెనక్కి పంపిస్తామని స్పష్టం చేసింది. విమానంలో వచ్చేవారు ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకోవాలని సూచించింది. ప్రయాణీకుల రిపోర్టును పరిశీలించాలని రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-11-25T17:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising