ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూమ్ యాప్: కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు!

ABN, First Publish Date - 2020-05-23T17:59:26+05:30

వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌ను బ్యాన్ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్  జూమ్‌ను బ్యాన్ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ హ్రిషికేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయమై 4 వారాల్లోగా స్పందించాలంటూ శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఓ గృహిణి ఈ పిల్‌ను దాఖలు చేశారు. జూమ్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిపన్షన్(మూడో వ్యక్తికి సమాచారం దొరకకుండా చేసే టెక్నాలజీ) లేదని, ఇందులోని లోపాల కారణంగా వ్యక్తిగత వివరాలు బయటకి పొక్కే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార భద్రత విషయంలో జూమ్ తగిన ప్రమాణాలు పాటించడంలో పదే పదే విఫలమవుతోందని సుప్రీం దృష్టికి తెచ్చారు. వ్యక్తిగత సమాచారం భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నా కూడా ప్రభుత్వం ఈ యాప్‌లో బ్యాన్ చేయట్లేదని తెలిపారు. అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అనేక ప్రభుత్వ సంస్థలు ఈ యాప్‌ను నిషేధించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

Updated Date - 2020-05-23T17:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising