ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల తరలింపునకు పక్షం గడువు

ABN, First Publish Date - 2020-06-06T08:00:10+05:30

లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర, రాష్ట్రాలకు 15

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వారి సమస్యలపై 9న ఉత్తర్వులిస్తాం: సుప్రీం
  • కోటి మందిని తరలించాం: సర్కారు నివేదన

న్యూఢిల్లీ, జూన్‌ 5: లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర, రాష్ట్రాలకు 15 రోజుల గడు వు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. వలస కార్మికుల పేర్ల రిజిస్ట్రేషన్‌, వారి ఉపాధి అవకాశాలు, స్వస్థలాలకు తరలింపుపై ఈనెల 9న ఉత్తర్వులిస్తామని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. వలస కార్మికుల కష్టాలను పోగొట్టి, వారిని స్వస్థలాలకు చేర్చేందుకు తీసుకున్న చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వలస కార్మికులను తరలించేందుకు ఈనెల 3దాకా ప్రభుత్వం 4,200 ‘శ్రామిక స్పెషల్‌ రైళ్లను నడిపిందని కేంద్రం తరఫున ఎస్జీ తుషార్‌ మెహతా ధర్మాసనానికి చెప్పారు. రైళ్లు, బస్సుల ద్వారా ఇంతవరకు కోటిమందికిపైగా వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చామని ఆయన వివరించారు. ఇం కా ఎంతమంది వలస కార్మికులను తరలించాలో, వారికి ఎన్ని రైళ్లు కావాలో రాష్ట్రాలే చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇదిలావుండగా, వలస కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... వారి విషయం లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఎన్‌హెచ్చార్సీని అనుమతించింది. 

Updated Date - 2020-06-06T08:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising