న్యాయవాది హాజరు న్యాయ ప్రక్రియలో భాగం
ABN, First Publish Date - 2020-12-29T09:28:16+05:30
నిందితుడి తరఫున న్యాయవాది కోర్టుకు హాజరు కావడం అనేది న్యాయ ప్రక్రియలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి
ఆ హక్కును కాదంటే వ్యక్తి స్వేచ్ఛ ఉల్లంఘనే: సుప్రీం
న్యూఢిల్లీ, డిసెంబరు 28: నిందితుడి తరఫున న్యాయవాది కోర్టుకు హాజరు కావడం అనేది న్యాయ ప్రక్రియలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి ఆ హక్కు లేకుండా చేయడమనేది రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని అభిప్రాయపడింది. 1987 నాటి ఒక హత్య కేసులో కింది కోర్టు తీర్పును ధ్రువీకరిస్తూ 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ కారణంతోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ కేసుకు సం బంధించి నిందితుడికి కింది కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. హైకోర్టులో అప్పీలుకు వచ్చినపుడు నిందితుడి తరఫున న్యాయవాది హాజరు కాలే దు. ఆ కారణంతో హైకోర్టు అతనికి కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షనే ఖరారు చేసింది. దానిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ, మళ్లీ తాజాగా నిందితుడి అప్పీలును విచారించాలని ఆదేశించింది.
Updated Date - 2020-12-29T09:28:16+05:30 IST