ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు మొక్కలతో ఔషధం.. క్లినికల్ ట్రైల్స్ చేస్తున్న సన్ ఫార్మా

ABN, First Publish Date - 2020-06-06T02:42:49+05:30

కరోనాను నిర్మూలించేందుకు సన్‌ఫార్మాస్యూటికల్స్ ఓ కొత్త ఔషధాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ సంస్థ సన్ ఫార్మా కొత్తగా ఓ ఔషధం తయారుచేసింది. కరోనా నిర్మూలనలో అది మేలైన ఫలితాలనిస్తోంది. మొక్కలను ఉపయోగించి ఈ ఔషధాన్ని దీనిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఏక్యూసీహెచ్ అనే ఈ ఔషధం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ, మొదటి దశ పరీక్షలో ఏక్యూసీహెచ్‌ను జంతువులపై ప్రయోగించామని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. రెండో దశలో నేరుగా కరోనా బాధితులపై ప్రయోగించనున్నట్లు తెలిపారు.


ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 12 సెంటర్లను ఎంపికచేసి అందులోని 210 మంది బాధితులపై ఈ ఔషధాన్ని ప్రయోగించనున్నామని చెప్పారు. దీని ఫలితం అక్టోబరులో రావచ్చని వివరించారు. ఇదిలా ఉంటే ఏక్యూసీహెచ్ ఔషధాన్ని డెంగీ కోసం తయారు చేశామని, అయితే ఈ ఔషధం వైరస్‌లను గొప్పగా ఎదుర్కుంటోందని, కరోనాపై కూడా మంచి ఫలితాలను సాధించిందని సన్‌ఫార్మా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితులపై దీనిని ప్రయోగించనున్నట్లు తెలిపింది.

Updated Date - 2020-06-06T02:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising