ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యపై ప్రేమ.. భయాన్ని జయించింది!

ABN, First Publish Date - 2020-04-03T08:36:47+05:30

కరోనా ఉగ్రరూపం దృష్ట్యా దేశదేశాల్లో ఉన్న భారతీయులందరూ స్వదేశం చేరుకునేందుకు తహతహలాడుతుంటే.. ఓ ముగ్గురు మాత్రం భారత్‌కు తిరిగి రావడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనాలోనూ ఇటలీ వీడని భారతీయులు

 న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: కరోనా ఉగ్రరూపం దృష్ట్యా దేశదేశాల్లో ఉన్న భారతీయులందరూ స్వదేశం చేరుకునేందుకు తహతహలాడుతుంటే.. ఓ ముగ్గురు మాత్రం భారత్‌కు తిరిగి రావడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. అందునా వారున్నది కరోనా దెబ్బకు శవాల దిబ్బలా మారిన ఇటలీలో. కరోనా వేటుకు ఆ దేశంలో వేల మంది మృత్యువాత పడుతున్నా.. ఏ మాత్రం జంకకుండా తమ విద్య, అధ్యయనాలను కొనసాగించేందుకే వారు మొగ్గు చూపుతున్నారు. ప్రబిన్‌ ఉపాధ్యాయ, ఆకాశ్‌ దీప్‌ బిశ్వాస్‌, ప్రోమిత్‌ చౌధురి అనే ఈ ముగ్గురు.. అస్సాంకు చెందిన వారు. ఒకరు పీహెచ్‌డీ చేస్తుండగా, మరొకరు కరోనాపై అధ్యయనం చేస్తున్నారు.


ఇంకొకరు.. వైద్యరంగంలో ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ దేశమైన ఇటలీ.. కొవిడ్‌ను ఎదుర్కొంటున్న విధానంపై అధ్యయనం చేస్తున్నారు. నాలుగేళ్లుగా వాళ్లు ఇటలీలోనే ఉంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు భారత్‌.. అక్కడున్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానం పంపినప్పటికీ వీరు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. తాము చేస్తున్న పనిని మధ్యలో వదిలి రావడం ఇష్టంలేకనే రాలేదని ఆ తర్వాత వీరు వెల్లడించారు. 

Updated Date - 2020-04-03T08:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising