ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు స్కూళ్లు విడిచిపెట్టకుండా చూడండి: సీఎం

ABN, First Publish Date - 2020-09-21T15:13:01+05:30

కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న నేపధ్యంలో పాఠశాలను మూసివేశారు. ఈ కారణంగా పలువురు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్: కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న నేపధ్యంలో పాఠశాలను మూసివేశారు. ఈ కారణంగా పలువురు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా విద్యాశాఖాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. విద్యకు దూరమవుతున్న చిన్నారుల జాబితాను రూపొందించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను తెలియజేయాలని సీఎం ఆదేశించారు. అలాగే దీనికి పరిష్కారమార్గాలను కూడా సూచించాలని కోరారు. 



ఈ సందర్భంగా విద్యాశాఖాధికారి ఒకరు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ... కలెక్టర్లకు, డీఈఓలకు ఒక లేఖ రాసిందని, దానిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడాలని, కొత్త విద్యార్థులను చేర్చుకోవాలని, ఇందుకోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని కోరారన్నారు. పాఠశాలలో ఇప్పటికే చదువుకుంటున్న విద్యార్థుల చిరునామాలు సేకరించి, వారు పాఠశాల మానివేయకుండా చూడాలన్నారు. పాఠశాలను తెరిచిన నేపధ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని కోరారన్నారు. కరోనా నేపధ్యంలో పాఠశాలల్లో తరగతులు నిర్వహించకపోయినప్పటికీ అడ్మిషన్ల ప్రకియ చేపట్టాలని, వివిధ మాధ్యమాలలో విద్యాబోధన కొనసాగించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారన్నారు. 

Updated Date - 2020-09-21T15:13:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising