ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక్కడ వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్న స్టూడెంట్స్

ABN, First Publish Date - 2020-07-06T17:17:27+05:30

పిచ్చి పలు రకాలు, ఒక్కోసారి ఇది శాడిజంలా కూడా కనిపిస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలబామా: పిచ్చి పలు రకాలు, ఒక్కోసారి ఇది శాడిజంలా కూడా కనిపిస్తుంటుంది. సరిగ్గా అమెరికాలోని విద్యార్థుల తీరు చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. ఓవైపు అమెరికాను వైరస్ ఉతికి ఆరేస్తుంటే.. అక్కడి జనం కూడా కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు వైరస్‌ను ఇతరులకు అంటించేందుకు పార్టీలు ఆర్గనైజ్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అరాచకానికి ఇది పరాకాష్ట. తన రోగం ఇంకో పదిమందికి అంటించాలనే పైశాచిక ఆనందం.. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఇలాగే ఉంది.


ఓవైపు కరోనాను అడ్డుకట్ట వేసేందుకు పెఢరల్ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతుంటే అక్కడి విద్యార్థులు మాత్రం కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాల ప్రయత్నాలకు చేయూత ఇవ్వాల్సిందిపోయి.. వైరస్ వ్యాప్తికి సహకరిస్తున్నారు. అలబామాలో కరోనా వైరస్ పార్టీలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైరస్ వ్యాప్తికి సహకరించేలా విద్యార్థులు పార్టీలు నిర్వహించడం షాక్‌కు గురిచేస్తోంది. అలబామా యూనివర్శిటీ విద్యార్థుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొందరు వర్శిటీ విద్యార్థులు కోవిడ్ పేరిట పార్టీలు నిర్వహించారు. దీనికి పాజిటీవ్ వచ్చిన స్టూడెంట్స్‌ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే వారి ద్వారా పార్టీకి హాజరైనవాళ్లలో ఎవరికి ముందుగా వైరస్ సోకుతుందో వాళ్లు విజేతలు. వారికి భారీగా నగదు బహుమతులు ఇస్తున్నారు. 

Updated Date - 2020-07-06T17:17:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising