ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ చేత‌న్ చౌహాన్‌కు క‌రోనా పాజిటివ్‌!

ABN, First Publish Date - 2020-07-12T13:56:22+05:30

భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ఆటగాడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రి చేతన్ చౌహాన్‌కు కరోనా సోకినట్లు గుర్తించారు. కోవిడ్ -19 లక్షణాలు క‌నిపించ‌డంతో మంత్రి ఆరోగ్య పరీక్షల‌ కోసం హజ్రత్‌గంజ్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ల‌క్నో: భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ఆటగాడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రి చేతన్ చౌహాన్‌కు కరోనా సోకినట్లు గుర్తించారు. కోవిడ్ -19 లక్షణాలు క‌నిపించ‌డంతో మంత్రి ఆరోగ్య పరీక్షల‌ కోసం హజ్రత్‌గంజ్‌లోని శ్యామా ప్రసాద్ ముఖ్జీర్ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ట్రూనెట్ పరీక్షలో అత‌నికి కరోనా వైరస్ సోకిన‌ట్లు తేలింది. ఈ నేప‌ధ్యంలో చేతన్ చౌహాన్‌... సంజయ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ)కి చెందిన‌ కోవిడ్ ఆసుపత్రిలో చేరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర అగర్వాల్ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులకు క‌రోనా టెస్టులు నిర్వ‌హిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. కాగా యూపీ రాజ‌ధాని లక్నోలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 202  కరోనా కేసులు నమోద‌య్యాయి. రాష్ట్రంలో కోవిడ్- 19 బాధితుల‌ సంఖ్య 35 వేలు దాటింది. 

Updated Date - 2020-07-12T13:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising