ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో అంత్యక్రియలు.. ముందుకొచ్చిన స్టార్టప్‌

ABN, First Publish Date - 2020-06-03T07:29:14+05:30

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్నిసార్లు సామగ్రి, వాహనాలు దొరక్కపోవడం వంటి సమస్యలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుణె, జూన్‌ 2: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్నిసార్లు సామగ్రి, వాహనాలు దొరక్కపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతోపాటు బంధుమిత్రులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భౌతికదూరం నిబంధనలు అడ్డువస్తున్నాయి. ఈ సమస్యకు తాము పరిష్కారం చూపుతామంటూ పుణెలోని ‘గురూజీ ఆన్‌ డిమాండ్‌’ అనే స్టార్టప్‌ ముందుకొచ్చింది. ‘మోక్ష సేవ’ పేరుతో అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా మృతుడి మరణ ధ్రువపత్రం పొందడంలో సాయం చేస్తామని చెబుతోంది. పాడెను ఏర్పాటు చేయడం, దహన సంస్కారాలకు పాస్‌ను తీసుకురావడం, పాడెను మోసేందుకు వ్యక్తులను ఏర్పాటు చేయడం, అంత్యక్రియలకు అవసరమయ్యే సరుకులను, పురోహితులను సమకూర్చడం వంటి సేవలను అందిస్తామని ఆ స్టార్టప్‌ నిర్వాహకులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఇబ్బంది పడకుండా వారి సమస్యకు సులువుగా పరిష్కారం చూపడమే తమ ఉద్దేశమని వారు చెప్పారు. ఈ నెలాఖరు లోపు ఆన్‌లైన్‌లో ఈ సేవలను ప్రారంభిస్తామన్నారు.


Updated Date - 2020-06-03T07:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising