కంగనా రనౌత్‌పై ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసు
ABN, First Publish Date - 2020-12-15T08:18:40+05:30
సినీ హీరోయిన్ కంగనా రనౌత్ తనపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు తెలుపుతూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసును దాఖలు చేశారు.
ముంబై, డిసెంబరు 14: సినీ హీరోయిన్ కంగనా రనౌత్ తనపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు తెలుపుతూ శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ప్రత్యేక హక్కుల ఉల్లంఘన నోటీసును దాఖలు చేశారు. కంగనా రనౌత్‌పై చర్యలు తీసుకోవాలని దాఖలు చేసిన ఆ నోటీసును అసెంబ్లీ శాసన హక్కుల కమిటీకి పంపాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆయన కోరారు. మనీ లాండరింగ్ కేసులో ఇటీవల సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రతాప్ సర్నాయక్ నుంచి పాకిస్థాన్ క్రెడి ట్ కార్డును స్వాధీనం చేసుకుందని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.
Updated Date - 2020-12-15T08:18:40+05:30 IST