ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19పై యుద్ధం : ఒక హజ్మత్ సూట్ అందజేయడానికి ప్రత్యేక విమానం!

ABN, First Publish Date - 2020-03-28T01:21:29+05:30

స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ కూడా అదే పని చేసింది. ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేయడంలో ముందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19ను ఓడించేందుకు ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ కదం తొక్కుతున్నారు. శుక్రవారం స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ కూడా అదే పని చేసింది. ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటామని చేతల ద్వారా నిరూపించింది. 


నోవల్ కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం 21 రోజులపాటు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు సహాయపడతామని స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. చెప్పినట్లుగానే ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఒకే ఒక హజ్మత్ సూట్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తీసుకెళ్ళి, కోయంబత్తూరులో అందజేసింది. ఈ విమానంలో ఇతర ప్రయాణికులు కానీ, సరుకులు కానీ లేవు. కేవలం ఒకే ఒక హజ్మత్ సూట్ మాత్రమే ఉంది.


స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్పైస్ జెట్ శుక్రవారం ఓ స్పెషల్ చార్టర్ ఫ్లైట్‌ను ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు నడిపింది. దీనిలో ఒకే ఒక హజ్మత్ సూట్‌ను తీసుకెళ్ళారు. 


ఈ హజ్మత్ సూట్ తప్ప మరేమీ ఈ విమానంలో లేదని అజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ హజ్మత్ సూట్‌ ఆధారంగా స్థానికంగా మరికొన్ని హజ్మత్ సూట్ల తయారీకి స్థానిక అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 


కరోనా వైరస్‌ను ఓడించేందుకు జరుగుతున్న పోరాటంలో మన ప్రభుత్వానికి, తోటి ప్రజలకు తాము చేయగలిగినంత సహాయం చేస్తామని చెప్పారు. 


అష్టదిగ్బంధనం సమయంలో మానవీయ కార్యక్రమాల కోసం ప్రజలకు, ప్రభుత్వానికి సాయపడతామని స్పైస్ జెట్ గతంలోనే ప్రకటించింది. 


ఇదిలావుండగా, కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలపై వచ్చే నెల 14 వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2020-03-28T01:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising