ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్.. ప్రైవేటు సంస్థ చేపట్టిన తొలి మానవసహిత అంతరీక్షయానం

ABN, First Publish Date - 2020-05-31T15:28:33+05:30

ప్రపంచ అంతరీక్ష చరిత్రలో కొత్త శకం మొదలైంది. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరీక్షంలోకి పంపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా: ప్రపంచ అంతరీక్ష చరిత్రలో కొత్త శకం మొదలైంది. తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ.. వ్యోగాములను అంతరీక్షంలోకి పంపింది.  ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ చెందిన ఫాల్కన్ రాకెట్.. ఇదరు నాసా వ్యోమగాములతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు(ఐఎస్ఎస్) పయనమైంది. నాసాకు చెందిన రాబర్ట్ బెహ్‌కిన్, డగ్లస్ హర్లీలు ఫాల్కన్ 9 రాకేట్‌పై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాయహ్నం 3.22కు దాదాపు 450 కిమీల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్‌ దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ ఈ ప్రయోగానికి వేదిక అయింది. స్పెస్ ఎక్స్ సంస్థ.. ఈ మిషన్‌కు డెమో-2గా నామకరణం చేసింది. రాకెట్ ప్రయాణం విజయవంతంగా ప్రారంభమవడంతో అంతరీక్షయానంపై ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యానికి ముగింపు చెప్పినట్టైంది. ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన తొలి మానవసహిత అంతరీక్షయానం ఇదే కావడంతో స్పెస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘మా అందరి కల నెరవేరింది’ అని ఈ సందర్భంగా సంస్థ అధినేత వ్యాఖ్యానించారు. ఇది విజయవంతంగా పూర్తయిన తరువాత.. సంస్థకు చెందిన డ్రాగన్ కాప్సుల్‌తో నిరంతరం మావనసహిత అంతరీక్షయానం చేపట్టేందుకు స్పేస్‌ ఎక్స్ సంస్థకు నాసా అనుమతి లభిస్తుంది. దాదాపు 19 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం.. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాకేట్.. స్పేస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పూర్తవుతుంది. ఇప్పటికే ఐఎస్ఎస్‌లో ప్రయోగాలు చేపడుతున్న వ్యోమగాములు క్రిస్ కాసిడీ, అనటోలీ ఇవానిషిన్‌లు అమెరికా ఆస్ట్రోనాట్లకు స్వాగతం పలుకనున్నారు.

Updated Date - 2020-05-31T15:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising