మరింత మెరుగుగా ఎస్పీ బాలు ఆరోగ్యం
ABN, First Publish Date - 2020-09-15T04:10:54+05:30
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన క్రమంగా ..
చెన్నై: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలు తనయుడు ఎస్పీచరణ్ మాట్లాడుతూ నాన్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఎస్పీబీ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ఆయన చెప్పారు. 20 నిమిషాల పాటు కూర్చొని వ్యాయామాలు చేస్తున్నారన్నారు. ఫిజియోథెరఫిస్టుల సాయంతో నాన్న వ్యాయామాలు చేస్తున్నారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
Updated Date - 2020-09-15T04:10:54+05:30 IST