ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ మర్కజ్ సమావేశానికి వచ్చిన దక్షిణాఫ్రికా ముస్లిమ్ మతాధికారి కరోనాతో మృతి

ABN, First Publish Date - 2020-04-05T17:15:07+05:30

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో గత నెలలో జరిగిన తబ్లిగ్ జమాత్ సమావేశానికి హాజరై తిరిగి దక్షిణాఫ్రికా వెళ్లిన ముస్లిమ్ మతాధికారి మౌలానా యూసుఫ్ టూట్లా (80) కరోనా వైరస్‌తో మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో గత నెలలో జరిగిన తబ్లిగ్ జమాత్ సమావేశానికి హాజరై తిరిగి దక్షిణాఫ్రికా వెళ్లిన ముస్లిమ్ మతాధికారి మౌలానా యూసుఫ్ టూట్లా (80) కరోనా వైరస్‌తో మరణించారు. జమాత్ సమావేశంలో పాల్గొని దక్షిణాఫ్రికాకు తిరిగివచ్చాక యూసుఫ్ టూట్లాలో ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చామని అతని కుటుంబసభ్యులు చెప్పారు. గత వారాంతంలో చికిత్స పొంది కోలుకున్న టూట్లా మళ్లీ అనారోగ్యానికి గురై మరణించాడని అతని కుటుంబసభ్యులు చెప్పారు.


ఈ సమావేశానికి వెళ్లవద్దని సూచించినా టూట్లా మాత్రం మొండిగా వెళ్లడం వల్ల కరోనా వైరస్ ప్రబలి మరణించాడని దక్షిణాఫ్రికా వర్గాలు వెల్లడించాయి. దీంతో ముందుజాగ్రత్తగా దక్షిణాఫ్రికా వైద్యాధికారులు మృతుడు టూట్లా కుటంబసభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు. టాట్లా మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఖననం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఇళ్లలో నుంచే ఆయన కోసం ప్రార్థనలు చేయాలని దక్షిణాఫ్రికా అధికారులు సూచించారు.

Updated Date - 2020-04-05T17:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising