ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీజీ... మేమూ మీవెంటే...

ABN, First Publish Date - 2020-03-26T20:11:33+05:30

కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన 21 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంపూర్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన 21 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పక్షాన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు. ‘‘కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తెలుపుతున్నాను’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు.


ఈ సమయంలో భేషజాలు, పక్షపాతాలను పక్కనబెట్టి, సమాజం పట్ల, దేశం పట్ల మానవత్వం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అన్ని ఇఎంఐలను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని, అలాగే ఈ సందర్భంలో ప్రతి బ్యాంకు వసూలు చేసే డబ్బులను కూడా వాయిదా వేసేలా కేంద్రం చూడాలని ఆమె లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తమ పార్టీ ప్రతిపాదించిన ‘న్యాయ్’ పథంక కింద కనీస ఆదాయాన్ని కూడా ప్రకటించాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఉందని, దానిని కూడా పరిశీలించాలని కోరారు. అలాగే రేషన్ కార్డులున్న వారికి పది కిలోల బియ్యం, లేదా గోధుమలను ఉచితంగా అందిస్తే బాగుంటుందని ఆమె లేఖలో అభిప్రాయపడ్డారు. అలాగే కరోనా వైరస్ ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడిందని ,వెంటనే వారికి తగిన ఉద్దీప చర్యలను తీసుకోవాలని సోనియా గాంధీ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-26T20:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising