ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌కు పంపించారని.. గ్రామపెద్ద కుమారుడి హత్య

ABN, First Publish Date - 2020-11-03T07:34:58+05:30

కరోనా పేరుతో తనను క్వారంటైన్‌కు పంపించారంటూ ఓ వలస కార్మికుడు గ్రామపెద్ద కుమారుణ్ని హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రవస్థి జిల్లాలో ఈ ఘటన జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బహ్రాయిచ్‌(యూపీ), నవంబరు 2: కరోనా పేరుతో తనను క్వారంటైన్‌కు పంపించారంటూ ఓ వలస కార్మికుడు గ్రామపెద్ద కుమారుణ్ని హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని శ్రవస్థి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కలీమ్‌ అనే వ్యక్తి అక్టోబరు 29న తమ దళిత గ్రామ పెద్ద కుమారుడు వేద్‌(12)ను కిడ్నాప్‌ చేసి, హత్య చేశాడు. అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే సరయు నది కాలువలో బాలుడి మృతదేహం కనిపించింది. పోలీసులు అతనితోపాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. తాను ముంబయిలో వలస కార్మికుడిగా పనిచేసి గ్రామానికి వస్తే.. కరోనా పేరుతో క్వారంటైన్‌కు పంపించారని, ఆ కోపంతోనే  ఇలా చేశానని కలీమ్‌ చెప్పినట్లు జిల్లా అదనపు ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. అయితే కలీమ్‌ క్వారంటైన్‌కు వెళ్లినట్లు రికార్డులేదని, హత్యకు మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. 


Updated Date - 2020-11-03T07:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising