ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను అంతం చేశాం: స్లోవేనియా ప్రకటన

ABN, First Publish Date - 2020-05-15T21:52:41+05:30

తమ దేశంలో కరోనా వైరస్‌ను పూర్తిగా అంతం చేసినట్లు స్లోవేనియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యూరప్‌లో కరోనా రహిత మొదటి దేశంగా స్లోవేనియా అవతరించింది. మరో విశేషం ఏంటంటే కరోనా ప్రభావం అత్యంత ఎక్కువగా ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లుబ్లియానా: తమ దేశంలో కరోనా వైరస్‌ను పూర్తిగా అంతం చేసినట్లు స్లోవేనియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యూరప్‌లో కరోనా రహిత మొదటి దేశంగా స్లోవేనియా అవతరించింది. మరో విశేషం ఏంటంటే కరోనా ప్రభావం అత్యంత ఎక్కువగా ఉన్న ఇటలీకి ఇది సరిహద్దు దేశం. అయినప్పటికీ కరోనాను కట్టడీ చేయడం గమనార్హం.


గత రెండు వారాలుగా దేశంలో రోజుకు రెండు కేసులు మాత్రమే నమోదు చేస్తున్నామని.. క్రమంగా కరోనాను పూర్తిగా అంతమొందించినట్లు స్లోవేనియా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇతర దేశాల నుంచి వచ్చిన స్వదేశీయులు తమ దేశానికి వస్తే గతంలో లాగ వారం రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.


స్లోవేనియా దేశానికి ఆస్ట్రియా, ఇటలీ, హంగేరీ, క్రొటేరియా సరిహద్దు దేశాలు. మార్చి 12న 1,464 పాజిటివ్ కేసులు, 130 మరణాలు ఉన్నట్లు స్లోవేనియా ప్రభుత్వం ప్రకటించింది.


కాగా తమ దేశంలో కరోనా అంతం చేయడం పట్ల ఆ దేశ ప్రధాన మంత్రి జానెజ్ జాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తాము కరోనాను మచ్చిక చేసుకుని అంతం చేశామని, ఈరోజు స్లోవేనియా యూరప్‌కు మహమ్మారి చికిత్సాలయంగా మారిందని ప్రధాని జాన్స్ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-15T21:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising