ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ర్యాలీలో నితీష్‌పైకి చెప్పులు విసిరన నిరసనకారులు

ABN, First Publish Date - 2020-10-27T16:56:06+05:30

నితీష్‌కు వరుస నిరసనలు ఎదురవుతున్నాయి. ఎప్పుడు శాంతియుతంగా ఉండే నితీష్ ఈ మధ్య తరుచూ సహనం కోల్పోతున్నారు. మొన్నా మధ్య ఓ సభలో.. నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముజఫర్‌పూర్: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై చెప్పులు విసిరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం ముజఫర్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీని ముగించుకుని హెలికాఫ్టర్ వద్దకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే నిందితులు విసిరిన చెప్పులు నితీష్‌కు తగలలేదు. చెప్పులు విసిరారని అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


నితీష్‌కు వరుస నిరసనలు ఎదురవుతున్నాయి. ఎప్పుడు శాంతియుతంగా ఉండే నితీష్ ఈ మధ్య తరుచూ సహనం కోల్పోతున్నారు. మొన్నా మధ్య ఓ సభలో.. నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాకు మీరు ఓట్లేయకపోయినా పరవాలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ఇది సంచలనంగా మారింది. ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ నితీష్‌కు ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఓ వైపు తేజస్వీ యాదవ్ సభలు జనాలతో కిక్కిరిసి అనుకూల నినాదాలతో విజృంభిస్తుంటే మరో వైపు నితీష్ సభలు వ్యతిరేక నినాదాలతో సతమతమవుతున్నాయి.


బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు విడతల పోలింగ్ జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాలకు బుధవారం(అక్టోబర్ 28) మొదటి దశ పోలింగ్ జరగనుంది. మొదటి దశ ప్రచారం ఇప్పటికే ముగిసింది. అనంతరం, నవంబర్ 3, 7 తేదీల్లో రెండవ, మూడవ దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Updated Date - 2020-10-27T16:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising