ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నితీశ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్టు ఓపెనింగ్ మార్చిలో

ABN, First Publish Date - 2020-12-21T00:37:01+05:30

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్టు గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్టు గ్లాస్ ఫ్లోర్ బ్రిడ్జ్ (ఆకాశ నడక) మార్చిలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు పనులను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఆయన జిప్ లైన్, జిప్ బైక్, మెయిర్ క్యాంప్ ఏరియాలను కూడా పరిశీలించారు. రాజ్‌గిర్‌లోని పర్యాటక ప్రాంతంలో నేచర్ సఫారీలో భాగంగా దీనిని నిర్మిస్తున్నారు. 


ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ నేచర్ పార్క్ పనులు దాదాపు పూర్తయ్యాయి. నితీశ్ కుమార్ మాట్లాడుతూ, జూ సఫారీ, నేచర్ సఫారీలను రాజ్‌గిర్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ రెండిటి పనులను ఒకేసారి చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పారన్నారు. నేచర్ సఫారీ వచ్చే మార్చినాటికి ప్రారంభమవుతుందని చెప్పారు. రాజ్‌గిర్‌కు గంగా నదీ జలాలు వస్తే, ఇక భూగర్భ జలాలను వాడవలసిన అవసరం ఉండదన్నారు. దీని కోసం పనులను ప్రారంభించినట్లు తెలిపారు. చారిత్రక స్థలాలను పరిరక్షించాలన్నదే తన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భావి తరాలు ప్రేరణ పొందడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 


Updated Date - 2020-12-21T00:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising