ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హత్రాస్’ బాధితురాలి బంధువుల ఆరోపణలపై సిట్ దర్యాప్తు : యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ

ABN, First Publish Date - 2020-10-04T00:52:43+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు చెందిన దళిత యువతిపై అఘాయిత్యం కేసులో బాధితురాలి బంధువులు లేవనెత్తిన అన్ని అంశాలను ప్రత్యేక దర్యాప్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు చెందిన దళిత యువతిపై అఘాయిత్యం కేసులో బాధితురాలి బంధువులు లేవనెత్తిన అన్ని అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ (హోం) అవనీష్ అవస్థి చెప్పారు. బాధితురాలి బంధువులతో సమావేశమై, మాట్లాడిన తర్వాత ఆయన ఈ విషయం తెలిపారు. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులను డీజీపీ హెచ్‌సీ అవస్థితో కలిసి అవనీష్ శనివారం కలిశారు. సిట్ సమర్పించిన మొదటి నివేదిక అందిన రెండు గంటల్లోనే పోలీసు సూపరింటెండెంట్‌, సీఐ సహా పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు అవనీష్ తెలిపారు. 


ఇది అత్యంత విచారకరమైన సంఘటన అని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడినట్లు తెలిపారు. దోషులందరినీ కఠినంగా శిక్షిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. సిట్ దర్యాప్తు జరుగుతోందని, ఇది కొనసాగుతుందని చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులు లేవనెత్తిన అంశాలను సిట్ పరిశీలిస్తుందని చెప్పారు. వీటిలో ప్రతి విషయం పరిష్కారమయ్యే విధంగా తాము కృషి చేస్తామని తెలిపారు. 


హత్రాస్ బాధితురాలిపై సెప్టెంబరు 14న దాడి జరిగింది. తీవ్రమైన గాయాలతో ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న మరణించారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. 




Updated Date - 2020-10-04T00:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising