ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే ఖాతా... మూడు డెబిట్ కార్డులు... మరో వెసులుబాటు కూడా...

ABN, First Publish Date - 2020-09-28T00:43:28+05:30

కటే ఖాతాపై ఇక మూడు వరకు డెబిట్ కార్డులు తీసుకోవచ్చు. అంతేకాదు... మూడు ఖాతాలకు కలిపి ఒకే ఏటీఎం కార్డును కూడా పొందవచ్చు. ఖాతాదారులకు బ్యాంకులు ఈ మేరకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘర్ : ఒకటే ఖాతాపై ఇక మూడు వరకు డెబిట్ కార్డులు తీసుకోవచ్చు. అంతేకాదు... మూడు ఖాతాలకు కలిపి ఒకే ఏటీఎం కార్డును కూడా పొందవచ్చు. ఖాతాదారులకు బ్యాంకులు ఈ మేరకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. 


ఇప్పటివరకు... ఒక ఖాతాకు ఒక డెబిట్ కార్డు మాత్రమే ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా... తాజాగా... కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. 


ఒక ఖాతాపై ఒకటి కన్నా ఎక్కువ డెబిట్ కార్డుల సదుపాయం వీటిలో ప్రధానమైనది. అంతేకాకుండా... ఒక డెబిట్ కార్డును ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలకు లింక్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఒక్క... దేశీ రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ఖాతాదారులకు మాత్రమే ఈ వెసులుబాటు అందుబాటులోకొచ్చింది.


‘యాడ్ ఆన్ కార్డ్, యాడ్ ఆన్ అకౌంట్’ పేర్లతో కొత్త సేవలను పీఎన్‌బీ ఆవిష్కరించింది. పీఎన్‌బీ వర్గాలు వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. యాడ్ ఆన్ కార్డు లో భాగంగా ఒక బ్యాంక్ ఖాతాపై మూడు డెబిట్ కార్డులను పొందొచ్చు. కస్టమర్లకు మెరుగైన సర్వీసులనందించాలన్న లక్ష్యంతో బ్యాంక్ ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.


అంతేకాదు... యాడ్ ఆన్ అకౌంట్‌ సర్వీసుల్లో భాగంగా మూడు రకాల అకౌంట్లను కూడా ఒకే డెబిట్ కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చు. అయితే... యాడ్ ఆన్ కార్డ్ ఫెసిలిటీ కేవలం ఖాతాదారుని తల్లిదండ్రులు, భాగస్వామి, పిల్లలకు మాత్రమే పొందగలిగే వీలుంటుంది. 


ఇక... మూడు అకౌంట్లను ఒకే డెబిట్ కార్డుతో అనుసంధానించుకోవడమన్నది ఇప్పటివరకు కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాగా... ఇలా లింక్ చేసుకున్న వారు డెబిట్ కార్డుతో మూడు ఖాతాల్లో. ఏ ఖాతానుంచైనా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే... ఈ సదుపాయం కేవలం పీఎన్‌బీ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


ఇక.. ఈ మూడు ఖాతాలు... ఒకే వ్యక్తి పేరుపై ఉంటేనే సంధానించుకోవడానికి అవకాశముంటుంది. కాగా... పీఎన్‌బీ ప్రవేశపెట్టిన ఈ తరహా సేవలనే త్వరలో మరికొన్ని బ్యాంకులు కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశముందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-09-28T00:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising