ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ అధికారంలోకి సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లోంగ్‌

ABN, First Publish Date - 2020-07-12T07:10:23+05:30

సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లోంగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు. కొవిడ్‌-19 వ్యాపించిన వాతావరణంలో శుక్రవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ(పీఏపీ) స్పష్టమైన మెజారిటీ సాధించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్‌, జూలై 11: సింగపూర్‌ ప్రధాని లీ సేన్‌ లోంగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చారు. కొవిడ్‌-19 వ్యాపించిన వాతావరణంలో శుక్రవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ(పీఏపీ) స్పష్టమైన మెజారిటీ సాధించింది. పార్లమెంటులోని మొత్తం 105 సీట్లకుగాను 93 స్థానాలకు జరిగిన ఎన్నికలలో పీఏపీకి 83 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షం 10 సీట్లు గెలుచుకుంది.  ప్రధాని లీ సేన్‌ లోంగ్‌ పాలక పీఏపీకి సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ 1965లో సింగపూర్‌ స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి అధికారంలో కొనసాగుతోంది. 2015 పార్లమెంటరీ ఎన్నికలలో పీఏపీకి 69.9 శాతం ఓట్లు రాగా తాజా ఎన్నికలలో 61.24 శాతం ఓట్లు సాధించింది. తమకు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ, ఓటింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో రాలేదని ప్రధాని లీ లోంగ్‌ శనివారం మీడియాతో వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-07-12T07:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising