ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఎస్‌ఐ బాలమురళి మృతి

ABN, First Publish Date - 2020-06-18T14:28:38+05:30

మాంబళం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ బాలమురళి కరోనా వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల ఐదున జ్వరం అధికం కావటంతో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మాంబళం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ బాలమురళి కరోనా వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల ఐదున జ్వరం అధికం కావటంతో ఆయన స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఆ పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో ఆయనను ప్రత్యేక వార్డులో చేర్చి వైద్యులు చికిత్సలందించారు. ఈనెల 13న ఆయన ఆరోగ్యపరిస్థితి బాగా క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు నగర పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ రూ.2.25 లక్షల విలువచేసే మందులను తన స్వంత ఖర్చులతో తెప్పించి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది.


29 మంది పోలీసులకు కరోనా

ఇదిలా ఉండగా చెన్నై ఐస్‌హౌస్‌, అయినావరం ప్రాంతాల్లో పనిచేస్తున్న 29 మంది పోలీసులకు కరోనా సోకింది. రెండు రోజులకు ముందు వీరంతా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఆ పరీక్షలలో పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో నగరంలోని నాలుగు ప్రఽభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. ఐస్‌హౌస్‌ ప్రాంతంలో వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న, పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్న 15 మంది పోలీసులకు కరోనా సోకింది. వీరిని కూడా చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

Updated Date - 2020-06-18T14:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising