ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంసం మార్కెట్లను మూసివేయండి...కేంద్రమంత్రికి జంతు హక్కుల సంఘాల వినతి

ABN, First Publish Date - 2020-03-27T18:29:27+05:30

దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మాంసం మార్కెట్లను పూర్తిగా మూసివేయాలని జంతుప్రేమికులు విన్నవించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మాంసం మార్కెట్లను పూర్తిగా మూసివేయాలని జంతుప్రేమికులు విన్నవించారు. దేశంలోని ఐదు జంతు పరిరక్షణ సంస్థలకు చెందిన ప్రతినిధులు సంయుక్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాశారు. కరోనా వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా మాంసం మార్కెట్లను మూసివేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని పీపుల్స్ ఫర్ ఎనిమల్స్, హ్యుమనీ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, మెర్సీ ఫర్ ఎనిమల్స్ ఇండియా ఫౌండేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎనిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్, అహింసా ట్రస్టులు కలిసి కేంద్రమంత్రికి లేఖ రాశాయి.  చైనా దేశంలోని వూహాన్ నగరంలో వన్యప్రాణుల మాంసం తినడం వల్లనే కరోనా వైరస్ ప్రబలిందని, దీనివల్ల వేలాదిమంది మరణించినందున మాంసం విక్రయాలను నిలిపివేయాలని కోరారు. దేశంలో ప్రజారోగ్యం మెరుగునకు జంతువుల వధను నిరోధించాలని పీపుల్ ఫర్ ఎనిమల్ ట్రస్టీ గౌరీ ములేఖీ కోరారు. 

Updated Date - 2020-03-27T18:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising