రాహుల్, కమల్‌నాథ్‌లపై విరుచుకుపడ్డ చౌహాన్
ABN, First Publish Date - 2020-12-16T00:47:33+05:30
రాహుల్, కమల్‌నాథ్‌లపై విరుచుకుపడ్డ చౌహాన్
భోపాల్: తమను రైతు వ్యతిరేకులను విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, కమల్‌నాథ్‌లు రైతులపై రుణాల పేరుతో మోయలేని బరువును మోపారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోపిన ఆ బురువును బీజేపీ ప్రభుత్వం దింపుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రైతులను ద్రోహం చేసిన వారే ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని శివరాజ్ విమర్శలు గుప్పించారు.
రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం.. డిసెంబర్ 18న 1,600 కోట్ల రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని శివరాజ్ చెప్పారు. ఇప్పటికే రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం చాలా డబ్బును వారి ఖాతాల్లో వేశామని ఇప్పుడు వేస్తున్నది అందులో భాగమే అని అన్నారు. అంతే కాకుండా మరో 1,600 కోట్ల రూపాయలు త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు శివరాజ్ సింగ్ తెలిపారు.
Updated Date - 2020-12-16T00:47:33+05:30 IST