ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవా కాదు.. కర్ణాటకలో కట్టిందే పెద్ద ప్లాంట్: డీకే

ABN, First Publish Date - 2020-07-11T21:21:06+05:30

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన మధ్యప్రదేశ్‌లోని రేవా ఆల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన మధ్యప్రదేశ్‌లోని రేవా ఆల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టుగా ఎలా చెబుతారని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రశ్నించారు. కర్ణాటకలో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


'రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఆసియాలోనే అతి పెద్ద ప్లాంటని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రకటించింది. మరి.. కర్ణాటకలోని పవగడలో 2000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ మాటేమిటి? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 ఏళ్లలో దాన్ని నిర్మించింది. 2018 నుంచి పని చేస్తోంది' అని డీకే శివకుమార్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.


పవగడలోని సోలార్ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత కూడా ఉందని డీకే అన్నారు. సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన 13,000 ఎకరాల భూమి యాజమాన్య హక్కులు కూడా వారికున్నాయని చెప్పారు. రైతుల నుంచి ఒక్క ఎకరం భూమి కూడా సేకరించలేదన్నారు. కర్ణాటక తరహా ఇంధన పునరుత్పత్తి మోడల్ దేశంలోనే అత్యుత్తమమైనదని ఆయన అభివర్ణించారు. రెండేళ్ల క్రితమే 2000 మెగావాట్లతో ప్రారంభమైన పవగడ పార్క్‌ ప్లాంట్‌ కంటే రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఎలా పెద్దదో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవా ప్రాజెక్టును ప్రధాని మోదీ శుక్రవారంనాడు జాతికి అంకితం చేశారు.

Updated Date - 2020-07-11T21:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising