శివసేన నాయకుడు సెక్యూరిటీ కోసం ఏం చేశాడంటే...
ABN, First Publish Date - 2020-03-13T13:32:01+05:30
శివసేన (హిందుస్థాన్) పార్టీ నాయకుడు పోలీసు భద్రత కల్పించాలని కోరేందుకు తానే గాయపర్చుకొని, తనపై దాడి జరిగిందని తప్పుడు కేసు పెట్టిన ఘటన....
లూథియానా(పంజాబ్): శివసేన (హిందుస్థాన్) పార్టీ నాయకుడు పోలీసు భద్రత కల్పించాలని కోరేందుకు తానే గాయపర్చుకొని, తనపై దాడి జరిగిందని తప్పుడు కేసు పెట్టిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో వెలుగుచూసింది. శివసేన (హిందూస్థాన్) పార్టీ నాయకుడు నరేందర్ భరద్వాజ్ తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గాయపర్చారని ఈ నెల 6వతేదీన లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు నిజం తెలిసి షాక్ కు గురయ్యారు.
శివసేన పార్టీ నాయకుడు తనకు ప్రాణభయం ఉన్నందున పోలీసు సెక్యూరిటీ కల్పించాలని కోరేందుకు తనకు తానే గాయపర్చుకొని, ఆగంతకులు తనపై దాడి చేశారని నాటకం ఆడారు. తప్పుడు కేసు పెట్టి పోలీసులను తప్పు దారి పట్టించిన నాయకుడు నరేందర్ భరద్వాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Updated Date - 2020-03-13T13:32:01+05:30 IST