ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్డీఏ కూటమికి శిరోమణి అకాలీదళ్‌ గుడ్‌బై

ABN, First Publish Date - 2020-09-28T08:23:47+05:30

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి శిరోమణి అకాలీదళ్‌ గుడ్‌బై చెప్పింది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి  శిరోమణి అకాలీదళ్‌ గుడ్‌బై చెప్పింది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం దరిమిలా బీజేపీ, అకాలీదళ్‌ మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్‌ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ బాదల్‌ రాజీనా మా కూడా చేశారు. వ్యవసాయ బిల్లుల ఆమోదానికి నిరసనగా ఆ పార్టీ పం జాబ్‌లో రైతులతో కలిసి ఆందోళనలూ చేస్తోంది. పంజాబ్‌ నాడి గురించి బీజే పీ దివంగత నాయకుడు అరుణ్‌ జైట్లీకి తప్ప ఆ పార్టీలో ఇంకెవరికీ తెలియదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నరేశ్‌ గుజ్రాల్‌ అన్నారు. పార్టీ కేడర్‌ నుంచి అభిప్రాయం తీసుకున్న ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పంజాబ్‌ రైతుల సమస్యలపై తమ ఆందోళనలను బీజేపీ పట్టించుకోవడం లేదని ఆ పార్టీ మరో నేత బల్వీందర్‌ సింగ్‌ విమర్శించారు.  


Updated Date - 2020-09-28T08:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising