ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం మాదే: చైనా

ABN, First Publish Date - 2020-07-03T03:38:39+05:30

బీజింగ్: రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం తమదేనంటూ చైనా కలకలం రేపింది. 1860కి ముందు వ్లాదివోత్సోక్ నగరం తమదిగా ఉండేదని చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీజీటీఎన్‌ సంపాదకీయం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం తమదేనంటూ చైనా కలకలం రేపింది. 1860కి ముందు వ్లాదివోత్సోక్ నగరం తమదిగా ఉండేదని చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీజీటీఎన్‌ సంపాదకీయం ప్రకటించింది. అక్రమ ఒప్పందంతో వ్లాదివోత్సోక్ నగరాన్ని రష్యా ఆక్రమించుకుందని ఆరోపించింది. ఒకప్పుడు వ్లాదివోత్సోక్ నగరం హైషెన్‌వాయిగా పిలవబడేదని సీజీటీఎన్ చీఫ్ షెన్ షివై ట్వీట్ చేశారు. 




చైనాలో మీడియా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుంది. సీజీటీఎన్ అధికారికంగా చేసిన ఈ ప్రకటన దుమారం రేపనుంది. రష్యాతో అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. చైనా గూఢచర్యం విషయంలో రష్యా ఇప్పటికే కోపంగా ఉంది. దీనికి తోడు భారత్‌కు రష్యా ఆయుధాలను పెద్ద ఎత్తున సరఫరా చేయడం చైనాకు నచ్చడం లేదు. రష్యా నుంచి భారత్ కొనే ఆయుధాలన్నీ తమపై ప్రయోగించేందుకే అని తెలిసి కూడా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 


గల్వాన్ లోయ ఘటనతో తలెత్తిన ఉద్రిక్తతలు సద్దుమణగకుండానే చైనా వ్లాదివోత్సోక్ నగరం తమదే అని చెప్పడం కొత్త వివాదానికి తెరలేపనుంది.  

Updated Date - 2020-07-03T03:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising