ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీఏ చైర్మన్ పదవిపై పవార్ స్పందన ఇదీ..!

ABN, First Publish Date - 2020-12-12T04:54:44+05:30

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్థానంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ యూపీఏ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్థానంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ యూపీఏ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు పుల్‌స్టాప్ పడింది. ఈ కథనాలన్నీ ‘‘తప్పుడు వార్తలే’’నంటూ పవార్ ఇవాళ కొట్టిపారేశారు. ‘‘ఇది ఓ తప్పుడు వార్త. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి..’’ అని ఆయన తేల్చిచెప్పారు. కాగా శరద్ పవార్ యూపీఏ చైర్మన్‌గా బాధ్యతలు చేపడితే తమకు సంతోషమేనంటూ శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావత్ పేర్కొన్న విషయం తెలిసిందే. పవార్ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. జాతీయ స్థాయి నాయకత్వం చేపట్టేందుకు పవార్‌కు పూర్తి సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తే సంతోషమే. అయితే ఈ బాధ్యతను స్వీకరించడానికి పవార్ వ్యక్తిగతంగా సుముఖత చూపలేదని నేను విన్నాను. అధికారికంగా ఈ ప్రతిపాదన వస్తే మాత్రం మేము తప్పకుండా మద్దతిస్తాం. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ చాలా బలహీనపడింది. యూపీఏను బలపరచడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చింది...’’ అని సంజయ్ రావత్ అన్నారు. 

Updated Date - 2020-12-12T04:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising